BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
రెండేళ్ల పాప జ్ఞానేశ్వరి ఎక్కడ? ఆ 40 ఎకరాల తోటలో చిన్నారికి ఏమైంది, దర్యాప్తులో వీడని చిక్కుముడి
తండ్రి కోసం వెళ్లిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి 35 నిమిషాల వ్యవధిలోనే పామాయిల్ తోటలో అదృశ్యమైంది. తొమ్మిది రోజులుగా వందలాది మంది వెతుకుతున్నా ఆచూకీ దొరకలేదు. తోడుగా వెళ్లిన కుక్క తిరిగొచ్చి చనిపోవడంతో ఈ కేసు మిస్టరీగా మారింది.
కాక్రోచ్ జనతా పార్టీ: హైదరాబాద్‌లో ఆందోళన ఎలా సాగింది, దీనిపై బీజేపీ ఏమంటోంది?
''దేశంలో సమస్యలపై ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్ అని, చైనా, పాకిస్థాన్ ఏజెంట్లు, దేశద్రోహి అంటున్నారు. ఇలా అనే వారికి చెప్పదలుచుకున్నదొకటే.. మేం భరతమాత ముద్దు బిడ్డలం, భగత్ సింగ్ తమ్ముళ్లం'' అని చెప్పారు నాగేశ్వర్.
అమెరికా - ఇరాన్ ఒప్పందం ఆదివారమేనన్న ట్రంప్: గడువుపై ఇరాన్ అనుమానాలు
యూఎస్, ఇరాన్ మధ్య ఘర్షణలను ముగించే శాంతి ఒప్పందం ఆదివారమే కుదరవచ్చని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే ఇరాన్ మాత్రం ఈ గడువుపై సందేహాలు వ్యక్తంచేసింది. ఈ ఒప్పందం ఖరారైతే ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధి అందరికీ అందుబాటులోకి రానుంది.
ఎయిరిండియా విమానం కూలుతున్న వీడియో తీసిన ఆర్యన్ ఆ తరువాత మళ్లీ ఏ విమానాన్నీ ఎందుకు వీడియో తీయలేదు?
''రన్‌వే నుంచి ఒక విమానం టేకాఫ్ అవ్వడం చూశాను. ఏదో సరదాగా, కుతూహలంతో దాన్ని వీడియో తీయడం మొదలుపెట్టాను. ఆ విమానం కొంచెం పైకి లేచి మళ్లీ కిందికి వచ్చింది. ఆపై మరోసారి పైకి లేచి, ముందుకు దూసుకెళ్లి కింద పడిపోయింది. వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగి, క్షణాల్లో పొగ కమ్మేసింది. అది చూసి నేను చాలా భయపడ్డాను'' అని ఆర్యన్ చెప్పారు.
వాహనాలకు నెంబర్ ప్లేట్ల వాడకం ఎప్పుడు, ఎక్కడ మొదలైంది?
హైదరాబాద్‌లో జూన్ 4న నిర్వహించిన పోలీసుల తనిఖీలలో నెంబర్ ప్లేట్ల విషయంలో అవకతవకలకు పాల్పడిన 2,100కు పైగా వాహనాలను సీజ్ చేసినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ వెల్లడించారు. నంబర్ ప్లేట్ క్లోనింగ్, ట్యాంపరింగ్, నకిలీ నెంబర్ ప్లేట్ల వాడకం, రెండు వాహనాలకు ఒకే నంబర్ వాడటం వంటివి ఈ తనిఖీల్లో గుర్తించారు.
పురుష మృతదేహాల ప్రైవేట్ పార్ట్స్‌పై వైద్య విద్యార్థిని అభ్యంతరకర వ్యాఖ్యలు.. విచారణకు ఆదేశం, అసలేం జరిగింది?
ఓ కామెడీ షోలో హిమాన్షుజాంగ్డా అనే వ్యక్తి డేట్‌కు తీసుకువెళ్లిన అమ్మాయికి బిర్యానీ ఇప్పించిన ప్రతిగా తానేం ఆశించానో చెప్పడం సామాజిక మాధ్యమాలలో తీవ్ర విమర్శలకుగురైంది. గతంలో ఇదే కామెడీ షోలో వైద్యవిద్యార్థిని సెజల్ పురుష శవాల శరీరభాగాలపై చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్‌గా మారి ట్రోలింగ్‌కు, విమర్శలకు గురైంది.
పిల్లల ఫోన్లలో నగ్న చిత్రాలు రాకుండా నిషేధించాలని యాపిల్, గూగుల్ సంస్థలకు సూచించిన బ్రిటన్ ప్రభుత్వం
బ్రిటన్ ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం.. 2024లో నమోదైన ఆన్లైన్ చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ రిపోర్ట్స్‌లో 91 శాతం కేసుల్లో పిల్లలే స్వయంగా సృష్టించిన కంటెంట్ ఉంది. ప్రస్తుతం అక్కడ సగటున 13 ఏళ్ల వయస్సుకే అశ్లీల కంటెంట్‌ను చూసే పరిస్థితి ఏర్పడిందని ప్రభుత్వం పేర్కొంది.
ఇరాన్‌తో రహస్య ఒప్పందం చేసుకున్నట్టుగా వచ్చిన కథనాలపై యూఏఈ, ఖతార్ ఏం చెప్పాయి?
మొత్తం 20 బిలియన్ డాలర్లు ఇరాన్ ఆస్తులు స్తంభింప చేశారని, యూఏఈపై ఇరాన్ దాడులు చేయకుండా ఉండటానికి ప్రతిగా ఈ ఒప్పందం కుదిరిందని దీని గురించి బాగా తెలిసిన ఇద్దరు వ్యక్తులు చెప్పినట్లు రాయిటర్స్ కథనం తెలిపింది. ఇందులో 3 బిలియన్ డాలర్లు తొలి విడతగా ఇప్పటికే విడుదల చేసినట్లు పేర్కొంది.
ఫుట్‌బాల్ ప్రపంచ కప్: ఇద్దరు ఆటగాళ్లు, రెండు దేశాలు, ఒకే కుటుంబం, ఆ రెండు దేశాలు తలపడితే?
వేరు వేరు దేశాల తరపున మైదానంలోకి దిగుతున్న తమ బిడ్డలను చూసి ఆ తల్లిదండ్రులు గర్వపడుతున్నారు. వారిద్దరు ఆడుతుంటూ చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇద్దరు ఆటగాళ్లు, రెండు దేశాలు, ఒకే కుటుంబం. అదృష్టత్తువశాత్తూ స్కాట్లాండ్ ఆస్ట్రేలియాతో తలపడితే, ఇద్దరు సోదరులు ప్రత్యర్థులుగా మైదానంలో నిలిస్తే?
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్‌లో
ఇరాన్
ఫీచర్లు
జనాభా లెక్కల కోసం ఒకప్పుడు పోస్టల్ స్టాంపులు, ఉత్తరాలు ప్రభుత్వానికి ఎలా సాయపడ్డాయంటే..
వంద కోట్లకు పైగా ఉన్న జనాభా, తమను తాము ఈ దేశ చరిత్రలో ఒక భాగంగా గుర్తించుకునేలా, ప్రభుత్వంపై అంతటి నమ్మకాన్ని ఉంచేలా వారిని ఒప్పించడమే ఆ సవాలు.
ఉత్తరాంధ్ర: ఈ ప్రాంతం ఉన్నది తూర్పు తీరంలో, పిలిచేది మాత్రం వేరేలా, ఎందుకిలా?
ఒక ప్రాంతం రాష్ట్రానికి తూర్పు వైపున ఉండొచ్చు. . అదే సమయంలో ఆ రాష్ట్రంలో ఉత్తర భాగంలో కూడా ఉండొచ్చు. ఉత్తరాంధ్ర విషయంలో ఇదే జరిగింది.
పానిపట్ యుద్ధం: కేవలం 20 వేల మందితో లక్ష మంది లోదీ సైన్యాన్ని బాబర్ ఎలా ఓడించారు?
కేవలం 20 వేల మందితో లక్ష మంది లోదీ సైన్యాన్ని బాబర్ ఎలా ఓడించారు? ఏనుగుల దళం వెనక్కి తగ్గేలా చేసిన ఆ వినూత్న వ్యూహం ఏమిటి? పానిపట్ మైదానంలో చరిత్రను మలుపు తిప్పి, మొఘల్ సామ్రాజ్యానికి పునాది వేసిన ఆ ఆసక్తికర యుద్ధ రహస్యాలు ఏమిటి?
ది గ్రేట్ గామా : జీవితంలో ఓటమెరుగని మల్లయోధుడి కథ, 'రోజుకు ఆరు కోళ్లు తిని, 20 లీటర్ల పాలు తాగేవారు..'
జాన్ బుల్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు 1910లో, గామాను లండన్ పంపించారు. కానీ గామా పొట్టిగా ఉండడంతో ఆయన్ను అనర్హుడిని చేశారు. కానీ అక్కడే ఎగ్జిబిషన్ మ్యాచ్‌ల కోసం బరిలోకి దిగిన గామా లండన్‌లోని ప్రపంచ స్థాయి రెజ్లర్లకు సవాల్ విసిరారు. 5 నిమిషాల పాటు తన చేతిని పట్టుకోగలిగిన వారికి 5 పౌండ్లు ఇస్తానని ప్రకటించారు.
ధురంధర్: పాకిస్తాన్లో పేరుమోసిన డాన్ రహమాన్ డకైత్ పోలీస్ కాల్పుల్లో ఎలా మరణించాడు?
‘‘రహమాన్ వచ్చారని చౌధరీ అస్లాంకు తెలుసు. కానీ తాను అస్లాం ఉచ్చులో పడ్డానని రహమాన్‌కు తెలియదు. వాహనం ఆపినప్పుడు రహమాన్ సహచరులు అడ్డుకోలేదు కూడా. నేను దానిని తీసుకోనప్పుడే మీరు నా పరువు చాలా తీసేసారు. నేను నిఘా సంస్థల దర్యాప్తును ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పుడు నేను దానిని తీసుకుంటే మీరేం చేస్తారు?’’
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్‌తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.



























































